+91 99635 77856

ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్ డి ఓ కు వినతి

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్ డి ఓ కు వినతి

-యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్..

హుజూరాబాద్/నవంబర్06 (మా అక్షరం): పట్టణంలోని సైదాపూర్ రోడ్డు లో గల ఎస్ ఆర్ ఎస్ పి ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ ఆర్ ఎస్ పి కి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారని, ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో యదేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని, అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే సదురు నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేని పక్షంలో ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులను సంబంధిత శాఖ మంత్రిని కలుస్తామని కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ప్రజల అవసరాలకు మరియు వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

-యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్..

హుజూరాబాద్/నవంబర్06 (మా అక్షరం): పట్టణంలోని సైదాపూర్ రోడ్డు లో గల ఎస్ ఆర్ ఎస్ పి ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ ఆర్ ఎస్ పి కి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారని, ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో యదేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని, అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే సదురు నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేని పక్షంలో ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులను సంబంధిత శాఖ మంత్రిని కలుస్తామని కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ప్రజల అవసరాలకు మరియు వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !