+91 99635 77856

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలి..

Kudikala Sai Editor
maaksharamnews.in

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలి..

- వెలమ కుల సంఘ నాయకుల డిమాండ్...
హుజురాబాద్/డిసెంబర్07(మా అక్షరం):వెలమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వెలమ కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు.శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెలమ కుల నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, ఆయన సాధించిన తెలంగాణ ఫలాలను అనుభవిస్తూ వెలమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వెలుమ నాయకులు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేసే విధంగా కృషి చేయాలని కోరారు. బేషరతుగా వెలమ కులస్తులకు క్షమాపణ చెప్పకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త వర్ధినేని రవీందర్ రావు,పుల్లూరి ప్రభాకర్ రావు,పమ్మిడి జగన్మోహన్ రావు, కళ్లెపు మోహన్ రావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు,కళ్లెపు రాఘవరావు,పొన్నగంటి శ్రావణ్ రావు,మాసాడి ముత్యంరావు, మాసాడి బాపూరావు, సాగి వీరభద్రరావు, కళ్లెపు సుధాకర్ రావు, బొంత మాధవరావు, తక్కల్లపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– వెలమ కుల సంఘ నాయకుల డిమాండ్…
హుజురాబాద్/డిసెంబర్07(మా అక్షరం):వెలమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వెలమ కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు.శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెలమ కుల నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, ఆయన సాధించిన తెలంగాణ ఫలాలను అనుభవిస్తూ వెలమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వెలుమ నాయకులు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేసే విధంగా కృషి చేయాలని కోరారు. బేషరతుగా వెలమ కులస్తులకు క్షమాపణ చెప్పకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త వర్ధినేని రవీందర్ రావు,పుల్లూరి ప్రభాకర్ రావు,పమ్మిడి జగన్మోహన్ రావు, కళ్లెపు మోహన్ రావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు,కళ్లెపు రాఘవరావు,పొన్నగంటి శ్రావణ్ రావు,మాసాడి ముత్యంరావు, మాసాడి బాపూరావు, సాగి వీరభద్రరావు, కళ్లెపు సుధాకర్ రావు, బొంత మాధవరావు, తక్కల్లపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !