+91 99635 77856

ప్రశ్నించే గొంతుకగా ముందంజలో ఉన్న పత్రిక శనార్తి తెలంగాణ

– ప్రింట్, డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది శనార్తి తెలంగాణ…
 -యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి..
కరీంనగర్/గన్నేరువరం జనవరి09(మా అక్షరం) :నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో అందిస్తూ, ప్రశ్నించే గొంతుకగా ప్రింట్ అండ్ డిజిటల్ రంగంలో దూసుకు వెళ్తున్న శనార్తి తెలంగాణ పత్రికను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, గన్నేరువరం గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, నాయకులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అతి తక్కువ కాలంలో ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల ఆధారాభిమానాలను పొంది డిజిటల్ ప్రింట్ రంగాలలో ప్రభంజనం సృష్టించిందని కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో శనార్తి తెలంగాణ
దినపత్రిక ముందంజలో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్, జిల్లా ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ బూర తిరుపతి, మాజీ ఈసీ మెంబర్ పాశం ఎల్లయ్య, శనార్తి తెలంగాణ రిపోర్టర్ జాలి నరేష్ రెడ్డి, నాయకులు దుడ్డు మల్లేశం,బద్దం సంపత్ రెడ్డి,కవ్వంపల్లి రాజయ్య, చిటికూరి కొమురయ్య, నక్క తిరుపతి,బిజెపి నాయకులు హరికాంతపు అనిల్, ప్రెస్ క్లబ్ సభ్యులు భీమనాతి వెంకటేష్,ఒద్నాల తిరుపతి, నల్లగొండ రామకృష్ణ అధిక సంఖ్యలో మండల ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !