+91 99635 77856

అత్యాచారాలు,అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

అత్యాచారాలు,అక్రమ రవాణా పై అవగాహన సదస్సు
హుజురాబాద్/ జనవరి 28( మా అక్షరం): మండలంలోని శాలపల్లి గ్రామంలో బాలికల మైనార్టీ స్కూల్లో మంగళవారం డార్కస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అత్యాచారాలు, అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హెడ్ కానిస్టేబుల్ యస్.ఓదెలు,టీ. జంపయ్య,
కానిస్టేబుల్ యం. అనిత కానిస్టేబుల్, వి.రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మనమే కలిసికట్టుగా ఎదుర్కొని వాటిపై పోరాడే బాధ్యత మనపై ఉన్నదన్నారు.అనంతరం
డార్కస్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ ఆలేటి సుధాకర్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలపై అత్యాచారాలు మరియు అక్రమ రవాణా బాగా పెరిగిపోయిందని,18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయడం, గర్భంలో ఆడ శిశువు అని తెలియగానే అబార్షన్లు (భ్రూణ హత్యలు), చేయడం వరకట్న వేధింపు కేసులు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారిని తీసుకొని వెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మి వేయడం, అలాగే కిడ్నాప్లకి పాల్పడడం నిత్యం మనం ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం ఇంకా మనం మాట్లాడుకోలేని మనం చర్చించలేనటువంటి జుగుప్సాకరమైనటువంటి! కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఐదు సంవత్సరాలలోపు ఆడపిల్లలకు, మూడు నాలుగు సంవత్సరాలలో ఆడపిల్లలకు కూడా చెప్పలేని, వివరించలేని విధంగా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి అనే నేర్పే అటువంటి భయం కరమైనటువంటి స్థాయిలో మన సమాజం ఉన్నదని, కాబట్టి నిత్యం సైబర్ నేరాలు ఇంటర్నెట్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా ఇతరత్రాల ద్వారా ఆడపిల్లల్ని అనేక రకాలుగా వేధిస్తూ భయపెడుతూ అలాగే వారిని ఎన్నో రకాలుగా శారీరక మానసికమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటి పై అవగాహన కల్పించి సురక్షిత గ్రామజ్యోతి అనే పుస్తకం విద్యార్థి విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మై చోయిసెస్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో 18004198588 అని హెల్ప్ లైన్ కి ఫోన్ చేసినట్లయితే బాధితులకు తక్షణమే సహాయం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, ఫీల్డ్ కోఆర్డినేటర్ పాక. చంద్ర ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !