హుజురాబాద్/ జనవరి 30(మా అక్షరం):
మా ఇల్లు మాకు కావాలంటూ హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనలో భాగంగా గురువారం రాస్తారోకో నిర్వహించిన అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కోరం సుధాకర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయనని హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతిని ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.గతంలో కూడా ఇళ్ల స్థలాలు విషయంలో మనోవేదన చెంది ఇద్దరు జర్నలిస్టులు గుండెపోటుతో మరణించారని అన్నారు.నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల సమస్యను పరిష్కరించకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో నందబి భరణి కుమార్, మక్సుద్, బొడ్డు శ్రీనివాస్, చిట్టంపల్లి సృజన్ కుమార్, అల్లి నరేందర్ సత్యరాజ్, పరంకుశం కిరణ్ కుమార్, వేల్పుల సునీల్ కుమార్, కేదాసీ శ్రీధర్, పబ్బ తిరుపతి, సమ్మెట సతీష్, ఎడ్ల కుమార్, మాచర్ల రాజు, కుడికల సాయి, కేశబోయిన స్వామి, పోతరాజు సంపత్, తదితరులు ఉన్నారు.











