+91 99635 77856

అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన సాయి సంతోష్ ను అభినందించిన సీఐ, కమిషనర్…

హుజురాబాద్/ ఫిబ్రవరి 04(మా అక్షరం): ఇటీవల ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ లో హుజురాబాద్ కు చెందిన జూపాక సాయి సంతోష్ కట్ట, కుమితే విభాగంలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ రావడం పట్ల హుజురాబాద్ టౌన్ సీఐ జి తిరుమల గౌడ్ శాలువా కప్పి జ్ఞాపకం చేసి అభినందించారు.

గోల్డ్ మెడల్ సాధించిన జూపాక సాయి సంతోష్ ని కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్లాక్ బెల్ట్ భూసారపు బాపూరావు, జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, కరాటే స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన టౌన్ సిఐ తో పాటు మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, సీనియర్ కరాటే మాస్టర్ బత్తుల సమ్మయ్య గోల్డ్ మెడల్ సాధించిన జూపాక సాయి సంతోష్ నీ సత్కారించి హర్షం వ్యక్తం చేశారు. అలాగే సాయి సంతోష్ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషిచేసిన కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్లాక్ బెల్ట్ భూసారపు బాపూరావుని మరియు జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ ని కరాటే స్టూడెంట్స్ ఘనంగా సన్మానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !