హుజురాబాద్/ మార్చి 04 (మా అక్షరం): మీసేవ జిల్లా మేనేజర్ల బదిలీలు, తొలగింపుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన మీ సేవలు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. మీసేవ కేంద్ర నిర్వహణకి ఏమైనా టెక్నికల్ సమస్యలు రెన్యువల్ కొత్త సర్వీసులు మీసేవ కేంద్రాల పర్యవేక్షణ గురించి ఈ జిల్లాస్థాయి మేనేజర్ లను నియమించారు. ఈ జిల్లాస్థాయి మేనేజర్ల నియామకం టి జి టి ఎస్, టీఎస్ ఆన్‌లైన్ ద్వారా జరుగుతుండగా, తాజాగా జరిగిన బదిలీలు అనుభవం, అర్హతలను పక్కనపెట్టి రాజకీయ మద్దతుతో అమలయ్యాయని తెలుస్తోంది.సమాచారం మేరకు, టి జి టి ఎస్ మీసేవ ప్రాజెక్ట్ ఉద్యోగుల్లో ఇద్దరు, టి ఎస్ ఆన్‌లైన్‌కు చెందిన ఓ టీం లీడర్ కలిసి ఓ ప్రతిపక్ష నాయకుడి సూచనల మేరకు ఈ మార్పులను జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నిర్ణయాల ప్రభావంతో అనుభవం ఉన్న కొందరు జిల్లా మేనేజర్లు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లకు పైబడిన వారై, కుటుంబ పోషణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో, అనుభవం, అర్హతల ఆధారంగా మీసేవ జిల్లా మేనేజర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారంలో లేకున్నా ప్రతిపక్ష నాయకుడు వివిధ శాఖల్లో తన అనుచరులను నియమించుకుంటూ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.











