+91 99635 77856

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

హుజురాబాద్/ మార్చి 08 (మా అక్షరం): పట్టణంలోని టిడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ సిటిజన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ బి.కమల, హెచ్ ఆర్ సి మెంబర్ ఆఫ్ కరీంనగర్ పులుగు లతా రెడ్డి, లీగల్ సెల్ అసిస్టెంట్ మెంబర్ ఆఫ్ బూర సరిత లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, లీగల్ సెల్ అడ్వైజర్ బీసీ నాయకులు సందేల వెంకన్న మాట్లాడుతూ… మహిళలు తమ హక్కులు సాధికారిత సమానత్వం కొరకు శతాబ్దాల పోరాటము చేసినప్పటికీ 19వ శతాబ్దం ప్రారంభములో స్త్రీలు తమ ఓటు హక్కు సాధన కొరకు పురుషులతో పాటు స్త్రీలకు సమాన వేతనము మెరుగైన జీవనం కొరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా ఇది గుర్తించిన ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈనాడు స్త్రీలు విద్యా సాంకేతిక రంగాలలో సమానత్వ అవకాశాలు పొందడానికి మూలకారకులైన, స్త్రీ విద్య కొరకు ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ అహర్నిశలు పాటుపడిన సావిత్రిబాయి పూలే దుర్గాబాయి దేశముఖ్ సేవలను ప్రతి ఒక్కరూ తమ హృదయములో పదిలపరుచుకొని వారిని అనునిత్యము స్మరించుకోవలసిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా స్త్రీలు ఆ మాతృమూర్తులను ఆదర్శంగా తీసుకొని విద్యా ఉద్యోగము సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినారు. కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల సదానందం, పోలీస్ కానిస్టేబుల్ ఈ రాజిరెడ్డి, టా ప్ర హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్, ట్రెజరరీ మండల వీరస్వామి, దొంత హరికృష్ణ, గాజర్ల బుచ్చి రాజం, బీసీ నాయకులు గరవేన శ్రీకాంత్ ముదిరాజ్, ఆళ్ల కేశవులు, మొలుగూరి కొమురయ్య, రాయబారపు కుమార్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !