హుజురాబాద్ /మార్చి 21( మా అక్షరం): స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ హుజూరాబాద్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో, పురపాలక సంఘం కమిషనర్ కే.సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వచ్చ భారత్ స్వచ్చ హుజూరాబాద్ కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిధిగా హాజరై, అంబేద్కర్ చౌరస్తా వద్ద మొక్కలను నాటి, వేసవి కాలము దృష్ట్యా చౌరస్తా వద్ద నూతనముగా ఏర్పాటు చేసిన చలివేంద్రమును, ఇంటింటికీ చెత్త సేకరణ కొరకు నూతనముగా కొనుగోలు చేసిన స్వచ్చ ఆటోలను, తడి-పొడి చెత్తను వేరువేరుగా సేకరించుటకు చెత్త డబ్బాలను ప్రారంభించారు.
పట్టణంలో అవగాహన ర్యాలీ…
అంబేద్కర్ చౌరస్తా నుండి సూపర్ బజారు మీదుగా ర్యాలీగా బయలుదేరి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు ఏర్పాటు చేసిన స్వచ్చ హుజూరాబాద్ కార్యక్రమములో హుజూరాబాద్ వాకర్స్ అసోసియేషన్, మహిళా సంఘాలు, పాఠశాలల విద్యార్థినీ-విద్యార్థులు, పట్టణ ప్రజలకు తడి-పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలను గురించి అవగాహన కల్పిస్తూ, ప్రతిరోజూ కూరగాయలను, కిరాణ సామాగ్రీని కొనుగోలు చేయుటకు బట్ట సంచులను మాత్రమే వినియోగించాలని అదనపు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో కార్యక్రమము ఐ ఈ సి ఎక్స్పోర్ట్ ఫణి, అంగన్ వాడీ సూపర్ వైజర్ పద్మ, మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి , రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె. శ్రీకాంత్, MD. రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మెప్మా CLRP & RPలు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, పట్టణ ప్రజలు, పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.











