+91 99635 77856

హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా పూర్తి.

-హరిప్రసాద్ అధ్యక్షుడు, మతిన్ ప్రధాన కార్యదర్శి‌గా ఎన్నిక..

హుజురాబాద్/ మే 18 (మా అక్షరం): హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం ఉత్కంఠ భరితంగా కొనసాగి శాంతియుతంగా ముగిశాయి. మొత్తం 926 ఓటర్లలో 607 మంది ఓటు హక్కును వినియోగించగా, రెండు బూత్‌లను ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ చేపట్టారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెలువడ్డాయి.అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మండల యాదగిరి, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి‌లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీ ఉత్కంఠను రేపింది. మక్కపల్లి రమేష్ (230), బుర్ర కుమార్ (97), ఎం.ఎ. మతిన్ (250) మధ్య పోటీ నడిచిన తీరులో, ఎం.ఎ. మతిన్ 20 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.సహాయ కార్యదర్శి పదవిలో కోట సంపత్ (306 ఓట్లు) కుడికల ప్రభాకర్ (290 ఓట్లు) పై 16 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నోటాకు 11 ఓట్లు నమోదయ్యాయి.ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వీరిలో ముషం రాజేంద్రము (473 ఓట్లు), కందల రమేష్ (438 ఓట్లు), తేలుకుంట్ల వేణు (347 ఓట్లు) గెలుపొందగా, తక్కువ ఓట్లు వచ్చిన కుడికల ప్రభాకర్ ఓటమి చెందారు.వారాల తరబడి కొనసాగిన ఎన్నికల వేడి చివరకు కొత్త పాలకవర్గం ఏర్పాటుతో ముగిసింది. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల ప్రధానాధికారి ఇలాసాగరం వీరస్వామి, ఇతర ఎన్నికల అధికారులు గెలుపు ధృవపత్రాలు అందజేశారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !