– సహాయ వ్యవసాయ సంచాలకులు జి.సునీత …
హుజురాబాద్/ఆగస్టు 24 (మా అక్షరం):
డివిజన్ పరిధిలో ఇప్పటివరకు యూరియా బస్తాలను కొనుగోలు చేయని రైతులకు ప్రాధాన్యతగా యూరియా అందజేయనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు జి.సునీత తెలిపారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల మేరకు త్వరలోనే తగినంత యూరియా బస్తాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఆమె అన్నారు.ఇప్పటికే యూరియా కొనుగోలు చేసిన రైతులు మళ్లీ కొనుగోలు చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరు యూరియా బస్తాలను కొనుగోలు చేశారో, ఎక్కడ తీసుకున్నారో, ఎన్ని బస్తాలు తీసుకున్నారో అనే పూర్తి వివరాలను సిద్ధం చేసినట్లు వివరించారు.రైతు సోదరులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలని కోరుచున్నామన్నారు.
Post Views: 166











