+91 99635 77856

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హుజూరాబాద్/ సెప్టెంబర్ 27( మా అక్షరం):తెలంగాణా పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం బస్ డిపో క్రాస్ వద్ద పద్మశాలి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాయితీ, త్యాగం, సేవా భావానికి ప్రతీక. ఆయన తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాక, తెలంగాణ ఉద్యమ పితామహుడిగా ఆయన చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారుఅని పేర్కొన్నారు.బాపూజీ ఆలోచనలు, సిద్ధాంతాలు యువతకు స్ఫూర్తినిస్తాయని, ఆయన ఆశయాలను నెరవేర్చడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు, కుల బాంధవులు, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 27( మా అక్షరం):తెలంగాణా పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం బస్ డిపో క్రాస్ వద్ద పద్మశాలి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాయితీ, త్యాగం, సేవా భావానికి ప్రతీక. ఆయన తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాక, తెలంగాణ ఉద్యమ పితామహుడిగా ఆయన చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారుఅని పేర్కొన్నారు.బాపూజీ ఆలోచనలు, సిద్ధాంతాలు యువతకు స్ఫూర్తినిస్తాయని, ఆయన ఆశయాలను నెరవేర్చడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు, కుల బాంధవులు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !