+91 99635 77856

హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ కాజీపేటలో మెరిసింది.

-హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ కాజీపేటలో మెరిసింది…
-కరాటే పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధన…

హుజురాబాద్/నవంబర్ 02 (మా అక్షరం):
గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న హుజురాబాద్ విద్యార్థులు, తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో కీర్తి సాధించారు.ఆదివారం కాజీపేట పరిధిలోని ఎజీఆర్ గార్డెన్స్‌లో శో టో కాన్ కరాటే డో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో హుజురాబాద్ విద్యార్థులు పలు విభాగాల్లో పతకాలు దక్కించుకున్నారు.14 సంవత్సరాల సీనియర్ బ్లాక్ బెల్ట్ కేటగిరీలో ఎస్కే సాదుల్లా బాబా కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.ఇంద్రనగర్‌కు చెందిన జున్ను కావ్య (14) కటాస్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.ఏడు సంవత్సరాల జూనియర్ విభాగంలో జి. నక్షత్ర కటాస్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.13 సంవత్సరాల ఆల్ కలర్ బెల్ట్స్ విభాగంలో సిహెచ్. సాయి చరణ్ కటాస్ గోల్డ్ మెడల్ సాధించాడు.ఏడు సంవత్సరాల అమ్మాయిల విభాగంలో పి. సహస్ర కటాస్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.ఐదు సంవత్సరాల అమ్మాయిల విభాగంలో పి. నిథి కటాస్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది.ఎనిమిదేళ్ల అమ్మాయిల విభాగంలో పి. కిరణ్ కటాస్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.ఏడు సంవత్సరాల వైట్ బెల్ట్ కేటగిరీలో అమన్ కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు.జాతీయ స్థాయి కరాటే పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డైరెక్టర్ గోపాల్, మాస్టర్ ఎస్కే జలీల్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకుడు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకుడు ఉప్పు శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు ఖలీద్ హుస్సేన్ తదితరులు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !