+91 99635 77856

కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం.

-కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం…
– ఘనంగా 85వ,జయంతి వేడుకలు..
– సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…

హుస్నాబాద్ /జనవరి 16 (మా అక్షరం) కేంద్ర మాజీ మంత్రి వర్యులు సూదిని జైపాల్ రెడ్డి ఉమ్మడి 85వ, జయంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం ప్రయివేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942, జనవరి 16న జన్మించారు.18 నెలల వయసులో పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు.
రాజకీయ జీవితం
ఈయన కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు.ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యునిగా 1990, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రభావితం చేసి సోనియాగాంధీ ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసేలా కృషి చేశారు.ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాగులు కానుకయ్య యాదవ్,పొన్నాల బాలయ్య,వేల్పుల రాజమల్లు,ఏం పోచయ్య,పీ. భూమయ్య, ఎస్. రమేష, మల్లేశం,శంకర్ సతీష్ కుమార్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !