-హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్..
-మున్సిపల్ పోరులో కాంగ్రెస్ దూకుడు….
-బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పలువురి చేరిక…
హుజూరాబాద్/జనవరి 29 (మా అక్షరం):మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతుండగా, మున్సిపల్ పోరులో ఆధిక్యం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాత్మక నాయకత్వంతో ముందుకెళ్తుండగా, హుజూరాబాద్ పట్టణానికి చెందిన జున్నోజు భాస్కర్, లవన్, శ్రీనివాస్‌లు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ వారిని కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం నూతనంగా చేరిన నాయకులు మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని కాంక్షించే ప్రజలు కాంగ్రెస్ వెంటే నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన ఊపిరి లభిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి,వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గూడూరి రాజేశ్వరి–స్వామి రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.











