-పేదింటి వివాహానికి కౌన్సిలర్ దంపతుల చేయూత…
-26 వ వార్డులో రూ.10,116 అందించిన కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులు..
హుజురాబాద్/ ఫిబ్రవరి26 (మా అక్షరం): మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో పేద కుటుంబాలకు చేయూత గా ఉంటామని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన భరోసా మేరకు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి దంపతులు ఓ నిరుపేద కుటుంబంలో వివాహానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. 26 వ వార్డుకు చెందిన నారోజు రాజ్యలక్ష్మి – రత్నా చారి దంపతుల కుమార్తె తరుణి వివాహము కందుకూరి రాజేందర్ తో గురువారం స్థానిక మధువని గార్డెన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహా రెడ్డి దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి రూ.10,116 /- ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ లావణ్య నర్సింహా రెడ్డి దంపతులను పలువురు అభినందించారు.











