కేశవపట్నం/ హుజురాబాద్ ఏప్రిల్ 10 (మా అక్షరం): కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయం (కే.జీ.బీ.వి)లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వడ్నాల మాధవి తెలిపారు.ఆరవ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎం.పి.సి గ్రూపులో చేరదలచిన విద్యార్థినులు నేరుగా కళాశాలను సంప్రదించవచ్చన్నారు. బై.పి.సి గ్రూపు ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
దరఖాస్తులు ఏప్రిల్ 15లోపు చేసుకోవాలని, మే 5న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. బై.పి.సి గ్రూపుకు ఆన్లైన్‌లో https://tgrjc.cgg.gov.in దరఖాస్తు చేయాల్సి ఉంటుందని సూచించారు.
మరిన్ని వివరాలకు కే.జీ.బీ.వి కేశవపట్నం (శంకరపట్నం)ను సంప్రదించవచ్చన్నారు.
Post Views: 99













