+91 99635 77856

జాగృతిలో చేరిన బిఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ‘రావుల’

-జాగృతిలో చేరిన బిఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ‘రావుల’….
– రావులకు కండువా కప్పి సాధారణ ఆహ్వానించిన కవిత …

హుజరాబాద్/ ఏప్రిల్ 11( మా అక్షరం):హుజూరాబాద్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర యువత విభాగం ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి అధ్యక్షురాలు కవిత రావుల రాజలింగారెడ్డికి కండువా కప్పి జాగృతి లోకి సాదరంగా ఆహ్వానించారు. రావుల రాజలింగారెడ్డి మండలంలోని పెద్ద పాపయ్య పల్లె గ్రామానికి చెందిన నాయకుడు. హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన లింగారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉంటూ తెలంగాణ భవన్లో సుదీర్ఘకాలం ఉంటూ కెసిఆర్ వెన్నంటే నడిచారు. పెద్దబాలపల్లి గ్రామానికి చెందిన పదిమంది యువకులను తెలంగాణ భవన్ లో ఉంచుకొని ఉద్యమ వ్యాప్తికి భవన్ కేంద్రంగా పనిచేశారు. బిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రాజలింగారెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సుపరిచితుడు. ఏళ్ల తరబడి కేసీఆర్ ఇంట్లో నిత్యం ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. స్వయంగా కెసిఆర్ లింగన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పార్టీ కార్యక్రమాలలో రాజ లింగారెడ్డిని బాగ స్వాముని చేశారు. తెలంగాణ జాగృతి కార్యక్రమాలను హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కవిత రాజలింగారెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా రాజ లింగారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను పల్లె పల్లెకు తీసుకు వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం నింపుతానని అన్నారు. నియోజకవర్గం లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని లింగారెడ్డి అన్నారు. రాజలింగారెడ్డి జాగృతిలో చేరడం పట్ల నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !