+91 99635 77856

ప్రపంచానికి యోగాను అందించిన మహోన్నత దేశం భారత్

– బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు…
హుజూరాబాద్ /జూన్ 21(మా అక్షరం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ… యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు.ప్రాచీన భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని, నేడు ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. భారత సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు యోగా ప్రతీకగా నిలిచిందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది భారతీయ సంస్కృతికి ప్రపంచ వేదికపై లభించిన గొప్ప గుర్తింపని పేర్కొన్నారు.మారుతున్న జీవనశైలితో ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
ప్రతి కుటుంబం, యువత, విద్యార్థులు యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు కేటాయించే సమయాన్ని తగ్గించి రోజుకు కనీసం 30 నిమిషాలు యోగాకు వెచ్చించాలని పిలుపునిచ్చారు. “యోగాతో ఆరోగ్యం – ఆరోగ్యంతో వికసిత భారత్” లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు చల్లూరి శ్రీధర్, కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, సెంట్రల్ ఫిలిం బోర్డ్ సభ్యుడు సబ్బని రమేష్, తూముల శ్రీనివాస్, రావుల వేణు, గంగిశెట్టి రాజు, పైళ్ల వెంకట్ రెడ్డి, కల్లెపు సుధాకర్ రావు, ఇలసాగరం వీరస్వామి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !