+91 99635 77856

మాణిక్యపూర్‌లో గ్రామీణ కబడ్డీ పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని

Kudikala Sai Editor
maaksharamnews.in

మాణిక్యపూర్‌లో గ్రామీణ కబడ్డీ పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని

హుజురాబాద్/ భీమదేవరపల్లి/ జూన్ 21 (మా అక్షరం): కబడ్డీ ఆట యువతలో ధైర్యం, క్రమశిక్షణ, చురుకుదనాన్ని పెంపొందిస్తుందని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్ గ్రామంలో ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు.మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో, గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి చైర్‌పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.ఫైనల్ పోటీలో మాణిక్యపూర్, కరీంనగర్ జట్లు తలపడగా మాణిక్యపూర్ జట్టు విజేతగా నిలిచి తొలి బహుమతిని దక్కించుకుంది. కరీంనగర్ జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ బహుమతి అందుకుంది. అనంతరం విజేతలకు ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు మంజుల రెడ్డి, ఉపసర్పంచ్ సమ్మయ్య, ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్‌పర్సన్ స్రవంతి, వార్డు సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ భీమదేవరపల్లి/ జూన్ 21 (మా అక్షరం): కబడ్డీ ఆట యువతలో ధైర్యం, క్రమశిక్షణ, చురుకుదనాన్ని పెంపొందిస్తుందని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్ గ్రామంలో ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు.మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో, గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి చైర్‌పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.ఫైనల్ పోటీలో మాణిక్యపూర్, కరీంనగర్ జట్లు తలపడగా మాణిక్యపూర్ జట్టు విజేతగా నిలిచి తొలి బహుమతిని దక్కించుకుంది. కరీంనగర్ జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ బహుమతి అందుకుంది. అనంతరం విజేతలకు ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు మంజుల రెడ్డి, ఉపసర్పంచ్ సమ్మయ్య, ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్‌పర్సన్ స్రవంతి, వార్డు సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !