+91 99635 77856

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం

-అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ.. ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక శిబిరాలు...

హుజురాబాద్/ నవంబర్ 19(మా అక్షరం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) నమోదు కార్యక్రమం హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన కుటుంబాల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.SEEEPC సర్వే ద్వారా గుర్తించిన ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఒక సంపాదించే సభ్యుడికి ఈ బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీ ఆధారంగా అర్హతను నిర్ధారిస్తారు.

గ్రామపంచాయతీల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు

మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక నమోదు శిబిరం ఏర్పాటు చేయనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు సంయుక్తంగా శిబిరాలను పర్యవేక్షిస్తారు. పంచాయతీ కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామ పాలన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ టీచర్లు ప్రజలకు నమోదు ప్రక్రియలో సహకరించనున్నారు.ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. శిబిరాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి.

నమోదు కోసం అవసరమైన పత్రాలు

🔹 ఆధార్ కార్డు జిరాక్స్

🔹 మొబైల్ నంబర్

🔹 రేషన్ కార్డు (ఉన్నట్లయితే)

🔹 నామినీ వివరాలు

రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు నంబరుగా పరిగణిస్తారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కోడ్ కేటాయించనున్నారు. ఇతర జిల్లాల రేషన్ కార్డులు కలిగిన వారు సైతం సమీప శిబిరంలో నమోదు చేసుకోవచ్చు.అర్హులైన కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పంపకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిబిరాల వద్ద పోలీసు భద్రతతో పాటు వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.అర్హులైన కుటుంబాలందరూ తమ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించే నమోదు శిబిరానికి హాజరై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Share ePaper Clip

Preparing image...

-అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ.. ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక శిబిరాలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !