+91 99635 77856

చెల్పూర్‌లో రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలు

Kudikala Sai Editor
maaksharamnews.in

చెల్పూర్‌లో రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలు

-600 మంది క్రీడాకారులు, ప్రతినిధుల హాజరు...

హుజురాబాద్ /నవంబర్ 21 (మా అక్షరం): మండలంలోని చెల్పూర్‌ గ్రామంలో రెండవ అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ టచ్ రగ్బీ అసోసియేషన్ సహకారంతో నవంబర్ 20 నుంచి 23 వరకు పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ చెల్పూర్ పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.కార్యక్రమానికి ఎస్ఐ రవి, సర్పంచ్ వంతడుపుల కస్తూరి, మణిందర్ శెట్టి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్. సారయ్య, కె. రాజిరెడ్డి తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.రగ్బీ క్రీడను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రంగు నిరంజన్ చారి, చిరుత శ్రీనివాస్, శ్వేత శ్రీనివాస్ తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

-600 మంది క్రీడాకారులు, ప్రతినిధుల హాజరు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !