-33 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టుల విజయంపై హర్షం..
హుజురాబాద్/నవంబర్ 19(మా అక్షరం): హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులకు చిరు సన్మానం నిర్వహించారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన కట్కూరి మల్లారెడ్డి, ఈసీ సభ్యులుగా ఎన్నికైన కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డి జర్నలిస్టులను సత్కరించారు.ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ తాటిపల్లి రాజన్న ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌లో 33 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో సేవలందిస్తూ, క్లబ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం అభినందనీయమని జర్నలిస్టులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల రత్నం తదితరులు పాల్గొన్నారు.













