హుజూరాబాద్ /నవంబర్18(మా అక్షరం):పట్టణంలో శ్రీ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా గణపతి పూజ, సంకల్పం, పుణ్యాహవచనం, అంకురార్పణం, గోపూజ, యాగశాల ప్రవేశం, నవగ్రహ హోమం, వాస్తు హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.మరో రెండు రోజులపాటు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ వేడుకల్లో హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Post Views: 80













