కరీంనగర్ జిల్లా /హుజూరాబాద్ :కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ – మృణాళిని వివాహ వార్షికోత్సవ వేడుకలను ప్రణవ్ సేవా దళం సభ్యుల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శంకర్ రైన్ మిల్లు సమీపంలో శుక్రవారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్, పాలు పంపిణీ చేశారు. అనంతరం టీం సభ్యులు మాట్లాడుతూ… వొడితల ప్రణవ్ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని, అదే విధంగా రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి పదవులను అలంకరించి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ సేవా దళం సభ్యులు జమాదగ్ని, ఎం.ఎ అలీం,
ఖాలీద్ హుస్సెన్, ఉప్పు శ్రీనివాస్, రావుల రాజేశ్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ప్రభాకర్, రియాజ్, విష్ణుదాసు గోపాల్ రావు,ఎర్రబోజు నారాయణ, వినోద్, దాట్ల ప్రభాకర్, తౌసిఫ్, కెఆర్ బిక్షపతి, బండ నవీన్, కడారి వంశీ, నరసింహస్వామి, ఎండి అజ్జు, మహిళా విభాగం నాయకురాళ్ళు తిరుమల, ఉప్పు దీపిక, బండ వెన్నెల, అమీన బేగం, ఎర్రబోజు న్వరూప తదితరులు పాల్గొన్నారు.













