– పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హుజురాబాద్ బిజెపి శ్రేణుల సంబరాలు..
-మాజీ ప్రధాని పివికి భారతరత్న తెలుగు జాతికి గర్వకారణం…
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న అత్యున్నత పురస్కారం లభించిన నేపథ్యంలో హుజురాబాద్ బిజెపి శ్రేణులు పట్టణంలో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, స్వీట్లు పంపిణీ చేసి టపాకులు పేల్చారు. ఇట్టి సంబరాల కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథి పాల్గొని మాట్లాడారు. పీవీకి భారతరత్న లభించడం పట్ల జిల్లావాసులుగా గర్వపడుతున్నామన్నారు. భారత దేశం కోసం పీవీ నర్సింహారావు ఎంతో సేవ చేశారని, కాంగ్రెస్ నేతగా ఉన్న పీవీ నరసింహారావును ఆ పార్టీ యే పూర్తిగా విస్మరించిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏ నాడు కూడా పీవీ నరసింహారావును గుర్తించిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.
రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు జిల్లా వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారం లభించడం సంతోషకరమన్నారు.కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్, మాసాడి ముత్యంరావు, నల్ల సుమన్, అడ్వకేట్ సత్యనారాయణరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లెని దేవేందర్ రావు, సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, మండల సాయిబాబా, మధిర రమేష్, బండి సాయి కృష్ణ, తేలుకుంట్ల శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బీమోజు వెంకట్, శివ, మోతే తిరుపతి, ఎండి మునీర్, బోరగాల సారయ్య, గుర్రం సంతోష, కొలిపాక వెంకటేష్, గుల్ల అనిల్, సమ్మయ్య, విక్రమ్, జంపాల రాజు, రాపాక రాజు, తదితరులు పాల్గొన్నారు













