+91 99635 77856

పీవీ కి భారత రత్న రావడం పట్ల హర్షం..

Kudikala Sai Editor
maaksharamnews.in

పీవీ కి భారత రత్న రావడం పట్ల హర్షం..

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్ :మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ,బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు కి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రకటించడం పట్ల ఎన్జీవో పీవీ సేవా సమితి హర్షం ప్రకటించింది. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. తను చేసిన ఆర్థిక సంస్కరణలతో దేశం ఆర్థికంగా ఎంతో ఎదిగిందన్నారు.అలాగే హుజురాబాద్ ని పీవీ పేరు తో జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్షులు టి. వెంకట్ రెడ్డి, సెక్రటరీ బి. మనోజ్ , కౌన్సిలర్లు స్వరూప ముత్యం రావు, రాజేంద్రప్రసాద్ తో పాటు వైద్యులు రామలింగారెడ్డి, విద్యాసాగర్, టి. మాధవ రావు, కె. శ్రీహరి, బి. సురేష్ గౌడ్, ఎం. కన్నయ్య,ఆర్ .తిరుపతి రెడ్డి,ఏ. సమ్మయ్య
పి.స్వామి,ఏ. చంద్రశేఖర్ రమేష్, రామచందర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !