కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్ అయిన రాజపల్లిలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు ఏసీపీ.జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజ పల్లిలో ఎస్సై సాంబయ్య ఆధ్వర్యంలో ట్రాలీలో 60 బస్తాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. కరీంనగర్ కు చెందిన రేవల్లి అనిల్ కుమార్, ట్రాలీ ఆటో డ్రైవర్ రేవల్లి జంపయ్య, మరో వ్యక్తి మహమ్మద్ రహీముద్దీన్ తో కలిసి చెల్పూర్ కు చెందిన రేషన్ డీలర్ షహనా సుల్తానా వద్ద కిలో రూ.16 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ గుర్తు తెలియని వ్యక్తికి విక్రయిస్తున్నట్లు తేలింది. షహనా సుల్తానా, రహీముద్దీన్, జంపయ్య అనిల్ కుమార్, మాక్యం సమ్మయ్య, గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి ట్రాలీ ఆటో, బియ్యంరూ.30 వేల నగదు, సెల్ ఫోన్ నీ స్వాధీరం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. షహనా రహిముద్దీన్ జంపయ్యను అరెస్టు చేయగా అనిల్ తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు. చెల్పూర్‌లోని షహనా రేషన్ దుకాణాన్ని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్ వసంతరావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌లు తనిఖీ చేసి13.64 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో జిల్లా కలెక్టర్ కు నివేదికలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
నెల రోజుల్లో 5 టన్నుల బియ్యం పట్టివేత
నెల రోజుల్లో హుజురాబాద్ డివిజన్ బియ్యం పరిధిలో ఐదు టన్నుల అక్రమ రేషన్ పట్టుకున్నట్లు ఏసీబీ జీవన్ రెడ్డి తెలిపారు. పదిహేను మందిపై కేసు లు నమోదు చేశామని తెలిపారు. ఒక లారీ, ఒక వ్యాన్, మూడు ఆటోలు, ఒక ఎడ్ల బండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రెండు మిల్లులను సీజ్ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జి సీఐ బి సంతోష్ కుమార్, ఎస్సై సాంబయ్య, పోలీస్ సిబ్బంది













