+91 99635 77856

జాతర వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

Kudikala Sai Editor
maaksharamnews.in

జాతర వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్:పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద ఈ నెల 21 నుండి 24వరకు నిర్వహించనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను హుజురాబాద్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్, టౌన్ సీఐ బొల్లం రమేష్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ లు సోమవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ.. ఆలయం పక్కన ఏర్పాటు చేసిన దుకాణదారులు, ప్రతి ఒక్కరు పోలీసుల నిబంధనలను పాటించేలా పాలకవర్గం అందరూ చూడాలని, ప్రతి ఒక్కరు పోలీసుల సూచనలు, నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.

తల్లుల సేవలో భక్తులు- భక్తుల సేవలో పోలీసులు అనే నినాదంతో పోలీసులు సేవలందించడం జరుగుతుందన్నారు. జాతర ప్రాంగణంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం జరగదని, ప్రతి ఒక్కరు వాహనాలను ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు పెద్దపాపయ్యపల్లిక్రాస్ వద్ద, జంపన్నవాగు వద్ద, ఒడ్డెరకాలని వద్ద ప్రధాన రహదారి పక్కన పార్కింగ్ స్థలాలల్లో నిలిపి జాతరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో జాతర నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.జాతర విజయవంతంగా ముగిసేలా కమిటీ పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని వారు పేర్కొన్నారు. అనంతరం కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గాలీబ్ కిరణ్, ఇవో సుధాకర్, సిబ్బంది లోకేష్, అశోక్, డైరెక్టర్లు చురుకంటి తిరుపతిరెడ్డి, సొల్లు హైమావతి, వలుగు తిరుపతి, కొలిపాక రమేష్,గడ్డం రాఘవేందర్, సుంకరి రాజేందర్, ఎర్ర నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, విష్ణు,సురేష్,రాజు, సుదర్శన్,సంపత్, ప్రణయ్,అచ్చుత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !