+91 99635 77856

చత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగిద్దాం

-ఏ సమస్య వచ్చిన నేను ఉన్న అని మర్చిపోకండి
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజరాబాద్ మున్సిపాలిటీలోని 18 వ వార్డు, బోర్నపల్లి లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

అలనాటి మొగల్ సామ్రాజ్యాన్ని ఓడించి హిందూ మత

స్థాపనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. సతీసహగమనాన్ని పూర్తిస్థాయిలో నిషేధించడానికి కృషి చేశారని అన్నారు.శివాజీ అన్ని మతాలను సమానంగా చూసేవారని, ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చేవారని అన్నారు.శివాజీ జయంతి రోజు ఆయన విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.అలాగే నియోజకవర్గం ప్రజలందరూ ఆదరించి గెలిపించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గం లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తనను కలవాలని సమస్య పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని అన్నారు.అలాగే సంక్రాంతి సమయంలో ఆరె కులస్తులు రథాన్ని తిప్పుతారని,రథాన్ని నిలిపేందుకు స్థలాన్ని కూడా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో మంటపాన్ని కూడా నిర్మిస్తానన్నారు.బోర్నపల్లి నుంచి ఇప్పల నర్సింగాపూర్ కు వెళ్లే రోడ్డును కూడా వేయాలని ఇటీవల అసెంబ్లీలో మాట్లాడాలని దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తానన్నారు.చిలుక వాగు బ్రిడ్జి తో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లాంటి పలు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తి చేస్తానని అన్నారు.18 వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల ,కృష్ణ మాట్లాడుతూ శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడగగానే స్పందించి విగ్రహానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల రెడ్డి, అపరాధ ముత్యం రాజు, కేసిరెడ్డి నరసింహారెడ్డిలతో పాటు అరె కుల సంఘం నాయకులు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !