+91 99635 77856

హుజురాబాద్ లోని ఏటీఎంలో చోరీ..

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ లోని ఏటీఎంలో చోరీ..

-ఆర్ధరాత్రి జరిగితే మరునాడు రాత్రి 9.15 తెలిపిన పోలీసులు
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల కోర్టు కాంప్లెక్స్ లోని ఎస్బిఐ ఎటిఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి మిషన్లను ద్వంసం చేసి చోరీకి పాల్పడినట్లు ఏటీఎం నెట్వర్క్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసచారి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపినవివరాల ప్రకారం... అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు సుమారు ఏటీఎంలోని రూ.8,64,100 రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు చోరీ జరిగిన ఆణవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఏటీఎం మిషనన్ను ద్వంసం చేసి తగలబెట్టారన్నారు. జరిగిన విషయాన్ని ఏటీఎం అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఏసీపీ శ్రీనివాస్ జి, టౌన్ సీఐ బొల్లం రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఏటీఎంను పరిశీలించారు. అనంతరం కరీంనగర్ నుండి వేలిముద్రలు సేకరించేవారిని రప్పించి క్లూస్ సేకరించారు. ఏటీఎం ద్వంసం చేసిన వెంటనే అలారం మోగడం, పోలీసులు సంఘటన స్థలాని చేరుకోవడం జరిగేది, కానీ అలాంటిది ఏమి జరగకపోవడం, అర్థరాత్రి చోరీ జరిగితే మరునాడు రాత్రి వరకు ఈవిషయం బయటకు తెలవకపోవడం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నెట్వర్క్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసచారి ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు సంఘటన గురించి తెలుసుకోవడం, ఆశ్చర్యంగా ఉందని,కాగా దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Share ePaper Clip

Preparing image...

ఆర్ధరాత్రి జరిగితే మరునాడు రాత్రి 9.15 తెలిపిన పోలీసులు
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల కోర్టు కాంప్లెక్స్ లోని ఎస్బిఐ ఎటిఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి మిషన్లను ద్వంసం చేసి చోరీకి పాల్పడినట్లు ఏటీఎం నెట్వర్క్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసచారి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపినవివరాల ప్రకారం… అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు సుమారు ఏటీఎంలోని రూ.8,64,100 రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు చోరీ జరిగిన ఆణవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఏటీఎం మిషనన్ను ద్వంసం చేసి తగలబెట్టారన్నారు. జరిగిన విషయాన్ని ఏటీఎం అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఏసీపీ శ్రీనివాస్ జి, టౌన్ సీఐ బొల్లం రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఏటీఎంను పరిశీలించారు. అనంతరం కరీంనగర్ నుండి వేలిముద్రలు సేకరించేవారిని రప్పించి క్లూస్ సేకరించారు. ఏటీఎం ద్వంసం చేసిన వెంటనే అలారం మోగడం, పోలీసులు సంఘటన స్థలాని చేరుకోవడం జరిగేది, కానీ అలాంటిది ఏమి జరగకపోవడం, అర్థరాత్రి చోరీ జరిగితే మరునాడు రాత్రి వరకు ఈవిషయం బయటకు తెలవకపోవడం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నెట్వర్క్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసచారి ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు సంఘటన గురించి తెలుసుకోవడం, ఆశ్చర్యంగా ఉందని,కాగా దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !