+91 99635 77856

రజాకర్ సినిమాను వీక్షించిన బిజెపి శ్రేణులు…

.నిజాం, రజాకర్ల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు…
.రజాకర్ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం…
.బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి….
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: పట్టణంలోని స్థానిక అన్నపూర్ణ థియేటర్ లో ఆదివారం రజాకర్ సినిమాని బిజెపి శ్రేణులు వీక్షించారు. ఈ సందర్భంగా.. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… నిజాం,రజాకర్ల చరిత్రను సినిమాలో కండ్లకు కట్టినట్లు చూపెట్టారని,చిత్రం అద్భుతంగా ఉందన్నారు. రజాకర్,నిజాంల అకృత్యాలు,ఆగడాల సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ చలింప చేసే విధంగా ఉన్నాయన్నారు.ఇన్నాళ్లు నిజాం రాజు చాలా గోప్పోడు అని పొగుడుతున్న వాళ్లకు “రజాకార్” సినిమా చూపించాలన్నారు. నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ల ను గొప్పగా చూపెట్టారన్నారు.తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సినిమా చూడాలన్నారు. నిజాం రజాకర్ల చరిత్రను తెలంగాణ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రాన్ని తీసిన దర్శక, నిర్మాతలకు, సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కురి అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు పైళ్ల వెంకటరెడ్డి నల్ల సుమన్, మాసాడీ ముత్యం రావు, జిల్లా నాయకులు,పట్టణ కమిటీ నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జి లు,సీనియర్ నాయకులు,బూత్ అద్యక్షులు, కార్యకర్తలు వీక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !