హుజురాబాద్/ ఆగస్టు 25(మా అక్షరం): నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రిని కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి, అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 39












