+91 99635 77856

హుజూరాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం

హుజూరాబాద్/ ఆగస్టు 25 (మా అక్షరం) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా హుజూరాబాద్ పట్టణం, మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. హుజూరాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ సుహాసినీ రొంటాల ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్ నుంచి లవ్ హుజూరాబాద్ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, మేనేజర్ ఆర్. భూపాల్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పి. వినయ్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అదేవిధంగా హుజూరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. రాంపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, సర్పంచ్ ముషం సంగీత, ఎంపీవో రాజేందర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని మొక్కలు నాటారు.

ఎంజేపీ బాలికల గురుకులంలో..

హుజూరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలోనూ వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారిణి (ఆర్‌సీవో) అంజలీదేవి హాజరై, ప్రిన్సిపాల్ శారదతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా ఆర్‌సీవో అంజలీదేవి మాట్లాడుతూ “పచ్చదనమే ప్రగతికి సోపానం. పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి” అని పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ పాఠశాలలో నిరంతరం హరిత వాతావరణం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, పర్యావరణ పరిరక్షణలో తమ విద్యార్థినులు ముందంజలో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !