+91 99635 77856

కుల గణన శాస్త్రీయంగా జరగాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

కుల గణన శాస్త్రీయంగా జరగాలి

-బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్...

-ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల కార్యక్రమం ప్రారంభం...

హుజురాబాద్/ ఆగస్టు 25 (మా అక్షరం): కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ పట్టణ కేంద్రంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి కుల గణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో జనగణన షెడ్యూల్‌లోని పదో అంశంలో ఎస్సీ, ఎస్టీ, కులం అని మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. ఓబీసీ, ఎస్‌ఈబీసీ వర్గాలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కుల గణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వల్ల గతంలో ఎస్‌ఈసీసీ-2011లో అక్షర దోషాలు, స్థానిక పేర్లు, పర్యాయ పదాలు, ఉపకులాల పేర్లలో తేడాల కారణంగా అనేక రకాల విభజనలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.ప్రతి కులానికి ప్రత్యేక డిజిటల్ యూనిక్ కోడ్ కేటాయించాలని, జాబితాలో లేని కులాల కోసం ప్రత్యేక ధ్రువీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సెస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణకు లేఖ రాసినట్లు తెలిపారు.బీసీల జనాభా వాటాను శాస్త్రీయంగా తేల్చేందుకు ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ నంబర్ కేటాయించి, ఆయా కులాలను బీసీ కాలమ్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రజలతో ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయించి పోస్టాఫీసుల ద్వారా పంపించే మలిదశ దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం మాట్లాడుతూ.. కుల గణన విధానం శాస్త్రీయంగా లేకపోతే చైతన్యవంతమైన బీసీ ప్రజలకు మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. స్పష్టత, శాస్త్రీయత లేని విధానాన్ని బీసీలపై రుద్దవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేపట్టాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షుడు కన్నబోయిన మహేందర్ యాదవ్, చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రామచంద్రం, పెద్దపాపయ్యపల్లి గ్రామ అధ్యక్షుడు సుంకనపల్లి శ్రీనివాస్, సంగం శ్రీనివాస్ (చిక్స్), సంగం శ్రీనివాస్ (మెడికల్), పంజాల వెంకటేష్ గౌడ్, దాసరి తేజ, వేముల మల్లయ్య, పూలగాని శ్రీనివాస్ తదితర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్…

-ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల కార్యక్రమం ప్రారంభం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !