+91 99635 77856

చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

Kudikala Sai Editor
maaksharamnews.in

చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

హుజురాబాద్/ఆగస్టు 23 (మా అక్షరం): చిన్ననాటి స్నేహానికి విలువనిస్తూ తమ బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించి మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి హైస్కూల్‌లో 1991లో ఏడో తరగతి చదువుకున్న విద్యార్థులు తమ బాల్యమిత్రుడు కొండపర్తి రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకున్నారు.రాజేందర్ కొంతకాలంగా పేదరికంతో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్న విషయం తెలుసుకున్న బాల్యమిత్రులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మిత్రులందరి తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రుడు రావుల వేణు మాట్లాడుతూ.. తమతో కలిసి చదువుకున్న మిత్రుల్లో ఎవరైనా ఆర్థికంగా లేదా ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు తమ వంతు సహాయం అందించేందుకు మిత్రులంతా ముందుకు వస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా తమ మిత్రుల్లో అవసరంలో ఉన్న వారికి వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు మంచికట్ల కోటిలింగం, జూపాక నరసింగం, కేశబోయిన సంపత్, పిట్ట నరసింగం, అంగీరక కిషన్, ఉప్పు రాజేందర్, ముక్క నర్సింగం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !