+91 99635 77856

హుజురాబాద్ డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్

హుజురాబాద్/ ఆగస్టు 27 (మా అక్షరం): జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న హుజురాబాద్ మున్సిపల్ డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గురువారం రాత్రి పరిశీలించారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి సమీపంలో జాతీయ రహదారి–563ను ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డును ఆమె సందర్శించారు.జాతీయ రహదారికి సమీపంలో డంపింగ్ యార్డు ఉండటంపై భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొంత దూరం వరకు చెత్తను డంప్ చేయకుండా నిలిపివేయాలని సూచించారు. రహదారికి కొంత దూరం తర్వాత మాత్రమే చెత్తను డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు.డంపింగ్ యార్డుకు చెత్త తరలించే వాహనాలు జాతీయ రహదారి మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేరుకునేలా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారి నుంచి చెత్త సేకరణ వాహనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు.హుజురాబాద్ పట్టణంలోని వివిధ డివిజన్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారిని ఆనుకొని చెత్త వేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో జలకుమారి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !