+91 99635 77856

బాల్య మిత్రురాలి కుటుంబానికి మిత్రుల ఆర్థిక చేయూత

Kudikala Sai Editor
maaksharamnews.in

బాల్య మిత్రురాలి కుటుంబానికి మిత్రుల ఆర్థిక చేయూత

హుజురాబాద్/ఆగస్టు31(మా అక్షరం):బాల్య మిత్రురాలు కొక్కుల రజిత కుటుంబానికి ఆమె పదో తరగతి చదువుకున్న మిత్రులు అండగా నిలిచారు. రాంపూర్ గ్రామానికి చెందిన రజిత భర్త అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె 2004-05పదో తరగతి మిత్రులు మానవతా దృక్పథంతో స్పందించారు. తమవంతు సహాయంగా సోమవారం రూ.20,500 ను రజితకు ఆర్థిక సహాయంగా అందజేశారు.చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆపద సమయంలో తమ బాల్య మిత్రురాలికి అండగా నిలిచిన మిత్రులకు రజిత కుటుంబ సభ్యులు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో తోటి మిత్రులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, మిడిదొడ్డి రాజు, నవీన్, రావుల సురేష్, జెట్టి నరేష్, అనిత, పుష్పలత, వనజ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !