హుజురాబాద్ / సెప్టెంబర్ 02(మా అక్షరం): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షురాలు, మహిళా నాయకురాళ్లు, సోషల్ మీడియా ఇన్‌చార్జి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24












