+91 99635 77856

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన

Kudikala Sai Editor
maaksharamnews.in

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన

-420 హామీలు–420 ఫిట్లు ఫ్లెక్సీతో ఆందోళన...

-ప్రజలకు చెల్లించాల్సిన బాకీలు వెంటనే చెల్లించాలి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 02(మా అక్షరం): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భారీ నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 3,000 మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. 420 హామీలు–420 ఫిట్లు పేరుతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డు ను ప్రజలకు పంపిణీ చేస్తూ హామీల అమలుపై ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు పూర్తయినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.మహిళలకు నెలకు రూ.2,500 సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను ప్రభుత్వం నిరాశపరిచిందని కౌశిక్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
భారీగా హాజరైన నాయకులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్‌రావు, పోల్నేని సత్యనారాయణరావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేష్‌తో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-420 హామీలు–420 ఫిట్లు ఫ్లెక్సీతో ఆందోళన…

-ప్రజలకు చెల్లించాల్సిన బాకీలు వెంటనే చెల్లించాలి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !