-మీ ఆరు గ్యారంటీలో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ ఏమైంది…?
-15వేల రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు..?
-మాయమాటలతో రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ …
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని,అధికారంలోకి రావడానికి రైతులను మభ్యపెట్టి అనేక హామీలు గుప్పించి నేడు దాటవేసే దోరణిలో ఉందని,అరు గ్యారంటీలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగు నీరు లేక పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం రైతులు అనేక కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని,సాగునీరు అందించక తీవ్ర ఇబ్బందులు పెడుతుందనీ ఆరోపించారు.రైతన్నలు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సాగునీరు లేక నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని,భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మోద్దు నిద్రలో ఉందన్నారు. రెండు లక్షల రుణమాఫీ,15వేల రైతు భరోసా, కౌలు రైతులకు ఇస్తామనీ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతంగంపై చిత్తశుద్ధి ఉంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలనీ,తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలనీ, ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలనీ,తాలు,తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ,ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలనీ,రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలనీ,ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలనీ,సమగ్ర పంటల బీమా ను అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు,భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలనీ,కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలనీ బిజెపి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ చందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మాడా గౌతంరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్ల కార్యదర్శి, మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్, జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యంరావు, జిల్లా సెక్రెటరీ సిహెచ్ నరసింహారాజ్, జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీ ఆకుల రాజేందర్, మండలాధ్యక్షులు గంగిశెట్టి రాజు, జీడి మల్లేష్, రామిడి ఆదిరెడ్డి, సంపెల్లి సంపత్ రావు, సర్పంచ్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, తూముల శ్రీనివాస్,యాంసానీ శశిధర్, తిప్ప బత్తిని రాజు, మోతే తిరుపతి,పల్లెపు రవి, కొలిపాక వెంకటేష్, గుర్రం సంతోష్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.











