+91 99635 77856

రైతు దీక్షను విజయవంతం చేయండి..

Kudikala Sai Editor
maaksharamnews.in

రైతు దీక్షను విజయవంతం చేయండి..

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: రైతులకు సకాలంలో సాగునీరు అందించకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.గురువారం జమ్మికుంటలో మొక్కజొన్న పంటను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ...రైతులు సాగునీరు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుందన్నారు. కెసిఆర్ పాలనలో ఒక్క ఎకరం కూడా తెలంగాణలో ఎండ లేదని, కాంగ్రెస్ పాలన నాలుగు నెలలలొనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరో తడి కోసం వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని నిలదీసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. రైతులకు మద్దతుగా శనివారం హుజరాబాద్ ప్రధాన చౌరస్తాలో చేపట్టిన ఒక్కరోజు దీక్షను రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: రైతులకు సకాలంలో సాగునీరు అందించకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.గురువారం జమ్మికుంటలో మొక్కజొన్న పంటను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…రైతులు సాగునీరు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుందన్నారు. కెసిఆర్ పాలనలో ఒక్క ఎకరం కూడా తెలంగాణలో ఎండ లేదని, కాంగ్రెస్ పాలన నాలుగు నెలలలొనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరో తడి కోసం వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని నిలదీసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. రైతులకు మద్దతుగా శనివారం హుజరాబాద్ ప్రధాన చౌరస్తాలో చేపట్టిన ఒక్కరోజు దీక్షను రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !