+91 99635 77856

తన నివాసంలో పార్టీ పతాకాన్ని ఎగరవేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పట్టణంలోని తన నివాసం వద్ద పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిలో పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉండే స్థాయికి ఎదిగిందన్నారు. ముచ్చటగా మూడోసారి కూడా 400 సీట్లు కైవసం చేసుకుని బిజెపి కేంద్రంలో అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అనంతరం పట్టణంలోని 49,50, 51 52 బూత్ శక్తి కేంద్ర ఇన్చార్జి తూర్పాటి రాజు యాంసాని శశిధర్ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం జరిగింది. పట్టణం లో పలు పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా బూత్ అద్యక్షులు పార్టీ పతాకాన్ని ఎగురవేసి టిఫిన్ బైటక్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కల్లెపు రేణుక, పట్టణ ఉపాధ్యక్షులు అంకటి శ్రీనివాసు, తిప్పబత్తిని రాజు, పోతుల సంజీవ్, కొలిపాక వెంకటేష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బొరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్,మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి తూర్పాటి రమాదేవి, బూత్ అధ్యక్షులు దేవేంద్ర రేణుక,రజిత, నాగరాజు, కుసుమ సమ్మయ్య, నీలం రవీందర్, తూర్పాటి రాజశేఖర్, తూర్పాటి రాజకుమార్, పురాణం శ్రీనివాస్, రమేష్, పర్థం, సాయి, గంధం సారయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !