-అభివృద్ధి పనులు అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదు…
-కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి తిరోగమనం…
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ఏప్రిల్20(మాఅక్షరం): పార్లమెంటులో తెలంగాణ ప్రజల గొంతుకగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం మార్నింగ్ వాక్ లో భాగంగా హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానం ఆవరణలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వినోద్ కుమార్ తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు.గతంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. ఉప్పల్ బ్రిడ్జితోపాటు బిజిగిరి షరీఫ్ బ్రిడ్జి తోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.కరీంనగర్ కి రైల్వే ఏర్పాట్లు కూడా కీలకపాత్ర పోషించారు అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.అభివృద్ధిలో భాగంగా హుజురాబాద్ గ్రౌండ్ ను కూడా మినీ స్టేడియం చేయడం కోసం పది కోట్లు వెచ్చించారని,పనులు జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా వాటిని అభివృద్ధి చేస్తుండగా అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చేసిన పనులు కొన్ని ఇప్పటికి మధ్యలోనే ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం మొదలుపెట్టక తప్పదని హెచ్చరించారు.బండి సంజయ్ ఎంపీగా ఉండి నియోజకవర్గానికి తట్టెడు మట్టైనా పోశాడా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా హుజురాబాద్ నియోజక వర్గానికి రాలేదన్నారు.టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పురోగమనం వైపు అడుగులు వేస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనము వైపు పోతుందని అన్నారు. కరీంనగర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, బిఆర్ఎస్ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గందె శ్రీనివాస్, కౌన్సిలర్లు బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











