-కరీంనగర్, హుజూరాబాద్ ట్విన్ సిటీ లుగా మారుస్తా…
-హుజురాబాద్ ను కలుపుతూ రైలు మార్గం ఏర్పాటు కూడా పూర్తి చేస్తా…
-పార్లమెంట్లో తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరవేస్త ఎంపీగా గెలిపిస్తే కౌశిక్ రెడ్డి తో కలిసి హుజురాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకుంటా..
-బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్…
హుజురాబాద్/ఏప్రిల్ 20(మాఅక్షరం): కరీంనగర్ ఎంపీగా మరోసారి అవకాశం ఇస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.శనివారం మార్నింగ్ వాక్ లో భాగంగా హుజురాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ ప్రజల సమస్యలపై ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురవిస్తానని ఆయన అన్నారు.గతంలో ఎంపీగా అవకాశం కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని అన్నారు.కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప్పల్ బ్రిడ్జితో పాటు బిజిగిరి షరీఫ్ బ్రిడ్జి కూడా పూర్తి చేశామన్నారు.కరీంనగర్ రైల్వే మార్గానికి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. కాజిపేట్ హసన్ పర్తి హుజురాబాద్ మీదుగా కరీంనగర్ కు కలిపే రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయమని అప్పుడే చెప్పామని దానిమీద కేంద్ర ప్రభుత్వం సుముఖముగా లేకపోవడంతో ఆగిపోయిందని ఎంపీగా గెలిచిన అనంతరం తప్పకుండా హుజురాబాద్ కు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.హుజురాబాద్, జమ్మికుంటలను ట్విన్ సిటీగా మారుస్తానని అన్నారు.కేంద్రం నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి రావలసిన నిధులను తప్పక తీసుకువస్తానని, హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో కలిసి పని చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని అన్నారు.











