-ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ…
– ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం…
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి …
– కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ …
హుజరాబాద్/ఏప్రిల్ 27(మాఅక్షరం): కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ అన్నారు.శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు… ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీదే అన్నారు. ఈ నెల 30న జమ్మికుంటలో డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానీదే అని అన్నారు. హామీలను విస్మరించిన గత ప్రభుత్వ పాలకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో దేశానికి చేసింది ఏమీ లేదని కేవలం మతం పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. దేవుళ్ళ పేరుతో ఓట్లు దండుకుంటున్నారు. జూన్ మూడో తేదీన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈనెల 30న జమ్మికుంటలో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి,కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు వేముల పుష్ప లత, పూదరి రేణుక, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాస్, సొల్లు బాబు, తౌటం రవీందర్, గూడపు సారంగపాణి, మోలుగురి సదానందం, బాలసాని రమేష్, దేశిని ఐలయ్య, సదానందం,మాజీ కాంగ్రెస్ పార్టీ యస్సిసెల్ జాయింటు కన్వీనర్ దొంత రమేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి కిరణ్, కుమార్, నేరెళ్ల మహేందర్ గౌడ్,గూడూరి స్వామి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు,సొల్లు బాబు, కొలిపాక శంకర్, సొల్లు దశరథం, ఆలేటి సుశీల, కడారి తిరుమల, సందమల్ల బాబు, సందమల్ల నరేష్, మేకల తిరుపతి, గంటా కిరణ్ రెడ్డి, సమ్మెట సంపత్, మల్లీశ్వరి,వలుగు తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్, విష్ణు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు











