+91 99635 77856

సీఎం గా మొదటిసారి జమ్మికుంటకు రేవంత్ రెడ్డి రాక…

Kudikala Sai Editor
maaksharamnews.in

సీఎం గా మొదటిసారి జమ్మికుంటకు రేవంత్ రెడ్డి రాక…

- సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత..  
హుజురాబాద్/ఏప్రిల్28(మా అక్షరం): ఈ నెల 30 మంగళవారం జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపునకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. సభకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,ఆది శ్రీనివాస్,మేడిపల్లి సత్యం,సభకు హాజరై కరీంనగర్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు విజయానికి కార్యకర్తకు దిశ నిర్దేశం చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన పథకాలు ఎక్కువగా ఉండడం వలన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

– సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత..  
హుజురాబాద్/ఏప్రిల్28(మా అక్షరం): ఈ నెల 30 మంగళవారం జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపునకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. సభకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,ఆది శ్రీనివాస్,మేడిపల్లి సత్యం,సభకు హాజరై కరీంనగర్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు విజయానికి కార్యకర్తకు దిశ నిర్దేశం చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన పథకాలు ఎక్కువగా ఉండడం వలన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !