+91 99635 77856

సిపిఐ లో చేరిన కోడుగూటి ప్రవీణ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

సిపిఐ లో చేరిన కోడుగూటి ప్రవీణ్..

హుజురాబాద్/మే 11(మాఅక్షరం): సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి,జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి సమక్షంలో శుక్రవారం మండలంలోని శాలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక ,స్వచ్చంద సేవకుడు, కోడుగూటి ప్రవీణ్, విద్యాసాగర్ మరికొంత మంది సిపిఐ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... నిరంతరం ప్రజలకోసం,పేద,బడుగు,బలహీనవర్గాల,కార్మిక, కర్షక శ్రేయస్సు కోసం పోరాడేది ఎర్ర జెండా పార్టీ సీపీఐ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న మానవ హక్కుల కోసం, అనేక రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు,కూలీలు వేతనాల పెంపుకోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేందుకు పాలకపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తూ,ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ సీపీఐ అని అలాంటి పార్టీలో ప్రవీణ్ చేరడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని హుజురాబాద్ ప్రాంతంలో సీపీఐ బలోపేతం కోసం తన వంతు కృషి చేయాలని ఆయన సూచించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ...

ప్రవీణ్ ప్రజా సంక్షేమం కోసం, నిరంతరం ప్రజల కోసం పని చేశారని, గ్రామంలో సామాజిక సేవ చేయడంలో కూడా ముందున్నారని గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో స్కూల్ బస్సును కొనుగోలు చేసి విద్యార్థుల సౌకర్యం కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడని,గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్స్ కు వెళ్లడానికి ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని, బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు అత్యంత సన్నితుడుగా ఉండేవారని,గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ప్రవీణ్ చేతుల మీదుగా ప్రారంభించారని అలాంటి ప్రవీణ్ సీపీఐ లో చేరి ప్రజలకు మరింత సేవ చేయాలని వెంకటస్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్,జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/మే 11(మాఅక్షరం): సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి,జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి సమక్షంలో శుక్రవారం మండలంలోని శాలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక ,స్వచ్చంద సేవకుడు, కోడుగూటి ప్రవీణ్, విద్యాసాగర్ మరికొంత మంది సిపిఐ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ… నిరంతరం ప్రజలకోసం,పేద,బడుగు,బలహీనవర్గాల,కార్మిక, కర్షక శ్రేయస్సు కోసం పోరాడేది ఎర్ర జెండా పార్టీ సీపీఐ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న మానవ హక్కుల కోసం, అనేక రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు,కూలీలు వేతనాల పెంపుకోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేందుకు పాలకపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తూ,ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ సీపీఐ అని అలాంటి పార్టీలో ప్రవీణ్ చేరడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని హుజురాబాద్ ప్రాంతంలో సీపీఐ బలోపేతం కోసం తన వంతు కృషి చేయాలని ఆయన సూచించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ…

ప్రవీణ్ ప్రజా సంక్షేమం కోసం, నిరంతరం ప్రజల కోసం పని చేశారని, గ్రామంలో సామాజిక సేవ చేయడంలో కూడా ముందున్నారని గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో స్కూల్ బస్సును కొనుగోలు చేసి విద్యార్థుల సౌకర్యం కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడని,గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్స్ కు వెళ్లడానికి ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని, బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు అత్యంత సన్నితుడుగా ఉండేవారని,గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ప్రవీణ్ చేతుల మీదుగా ప్రారంభించారని అలాంటి ప్రవీణ్ సీపీఐ లో చేరి ప్రజలకు మరింత సేవ చేయాలని వెంకటస్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్,జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !