+91 99635 77856

ఈ పాపం ఎవరిది..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఈ పాపం ఎవరిది..

-చెత్త కుప్పలో ఆడ శిశు మృతదేహం లభ్యం..
హుజురాబాద్/మే10(మాఅక్షరం): గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల పక్కన చెత్త కుప్పలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ...శుక్రవారం హుజురాబాద్ పట్టణ ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్ల పక్కన చెత్త కుప్ప చాటున మహిళ శిశువు మృతదేహం కనిపించగా...అటు పక్కన వెళుతున్న కొందరు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గమనించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించి ఘటన స్థలం వద్ద వివరాలు సేకరించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇక్కడ పడవేశారా... అక్రమ సంతానమా... లేక ఆడపిల్లను కానీ తల్లి బంధం తెంచుకుందా... స్థానికులు చర్చించుకుంటున్నారు. శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Share ePaper Clip

Preparing image...

-చెత్త కుప్పలో ఆడ శిశు మృతదేహం లభ్యం..
హుజురాబాద్/మే10(మాఅక్షరం): గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల పక్కన చెత్త కుప్పలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం …శుక్రవారం హుజురాబాద్ పట్టణ ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్ల పక్కన చెత్త కుప్ప చాటున మహిళ శిశువు మృతదేహం కనిపించగా…అటు పక్కన వెళుతున్న కొందరు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గమనించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించి ఘటన స్థలం వద్ద వివరాలు సేకరించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇక్కడ పడవేశారా… అక్రమ సంతానమా… లేక ఆడపిల్లను కానీ తల్లి బంధం తెంచుకుందా… స్థానికులు చర్చించుకుంటున్నారు. శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !