–బై బై మోడీ.. బై బై బండి…
-కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్..
హుజురాబాద్/మే 11(మాఅక్షరం) పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుజురాబాద్, జమ్మికుంట పట్టణల లో ఐదు మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్త లో ఫుల్ జోష్ ను పెంచారు.కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా ఐదు మండలాలలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ బై బై మోడీ.. బై బై బండి అంటూ తనదైన శైలిలో బైక్ ర్యాలీ చేశారు. హుజురాబాద్,నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ.. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బైక్ ర్యాలీ చేస్తూ జమ్మికుంట వరకు చేరుకొని జమ్మికుంట పట్టణంలోని, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డ్ లో బైక్ ర్యాలీ చేస్తూ ఫ్లైఓవర్ మీదుగా కొత్తపల్లి లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికలు పూర్తి కాగానే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు,కొత్త పింఛన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో 2500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం జరుగుతుందని, రైతన్నల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త చేతి గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏడు నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలా మిగిలిన ఈ రెండు రోజులు కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి క్రిష్ణా రెడ్డి,సొల్లు బాబు ఖాజీపేట శ్రీనివాస్,కొల్లూరి కిరణ్, కోలిపాక శంకర్, ఏర్ర రమేష్ ఏర్ర నాగరాజు మిడిదొడ్డి శ్రీనివాస్ మిడిదొడ్డి,గడ్డం రాఘవేంద్ర, అమర్ మైనారిటీ నాయకులు యండి అఫ్సర్, గడ్డం రాఘవేంద్ర వల్గు తిరుపతి, బండరి సదానందం,తునికి రవీందర్, యూత్ నాయకులు మేకల రాజు కుమార్, బండ నవీన్, మాచర్ల నరేష్ కుమార్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.











